న్యూఢిల్లి : టాటా మోటార్స్ సరికొత్త విద్యుత్ కారును బుధవారం విడుదల చేసింది. నెక్సాన్ ఈవీ మ్యాక్స్ పేరుతో వచ్చిన ఈ కారులో 40.5 కేడబ్ల్యూహెచ్ లిథియం-ఐయాన్ బ్యాటరీని అమర్చారు. నెక్సాన్ ఈవీతో పోలిస్తే.. దీని సామర్థ్యం 33 శాతం అధికమని కంపెనీ తెలిపింది. ధర రేంజ్ కూడా రూ.17.74 లక్షల నుంచి రూ.19.24 లక్షల వరకు పలుకుతున్నది. ఇందులో ఎకో, సిటీ, స్పోర్ట్ అనే మూడు డ్రైవింగ్ మోడ్‌లు లభిస్తాయి. ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేస్తే.. 437 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. దీన్ని 50 కేడబ్ల్యూ డీసీ ఫాస్ట్ ఛార్జర్‌తో 56 నిమిషాల్లో 80 శాతం ఛార్జింగ్ చేయవచ్చు. 9 సెకన్స్‌లో గంటకు 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది.
250 ఎన్‌ఎం టార్క్ వద్ద 105 కేడబ్ల్యూ శక్తిని విడుదల చేస్తుంది. ఎక్కడ బ్రేక్ వేస్తే.. అక్కడే ఆగేలా.. ఇంటెలిజెంట్ వాక్యూమ్ లెస్ బూస్ట్ అండ్ యాక్టివ్ కంట్రోల్ వ్యవస్థను అమర్చారు. అన్ని వీల్స్‌కు డిస్క్ బ్రేకులు ఉంటాయి. ఎలక్ట్రిక్ సన్ రూఫ్, రేర్ ఏసీ వెంట్స్, వెంటిలేటెడ్ లెదర్ సీట్లు, ఎయిర్ ప్యూరిఫయర్ వంటి అదనపు ఫీచర్లను అందించారు. ఇక టెక్ ఫీచర్ల విషయానికొస్తే.. వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ చార్జింగ్, ఆటో డిమ్మింగ్ ఐఆర్‌వీఎం, రిమోట్ కమాండ్, స్మార్ట్ వాచ్ ఇంటగ్రేషన్, హర్మన్ ఇన్ఫోటైన్‌మెంట్ వంటి అత్యాధునిక టెక్నాలజీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఎక్స్‌జెడ్ ప్లస్ ధర రూ.17.74 లక్షలు, ఎక్స్‌జెడ్ ప్లస్ లక్స్ రూ.18.74 లక్షలు, ఎక్స్‌జెడ్ ప్లస్ ఏసీ ఎఫ్‌సీ డబ్ల్యూఎంయూ ధర రూ.18.24 లక్షలు, ఎక్స్‌జెడ్ ప్లస్ లక్స్ ఏసీ ఎఫ్‌సీ డబ్ల్యూఎంయూ రూ.19.24 లక్షలకు పలుకుతున్నది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి