Friday, November 22, 2024

భారత్ నుంచి రాకపోకలను నిషేధించిన న్యూజిలాండ్

భారత్ నుంచి వచ్చేవారిని దేశంలోకి తాత్కాలికంగా అనుమతించవద్దని న్యూజిలాండ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో న్యూజిలాండ్ ప్రధాని జెసిండా అడర్న్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అటు భారత్‌లో కరోనా కేసులు పెరుగుతుండటంతో పాటు న్యూజిలాండ్ సరిహద్దులో గురువారం రోజు 23 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 17 కేసులు భారత్ నుంచి వచ్చిన వారిలో వెలుగుచూశాయి. దీంతో అప్రమత్తమైన న్యూజిలాండ్ ప్రభుత్వం భారత్ నుంచి రాకపోకలపై ఆంక్షలు విధించింది. ఈ నెల 11 నుంచి 28వ తేదీ వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని తెలిపారు. ఈలోపు సురక్షితంగా రాకపోకలు నిర్వహించడానికి మార్గాలను అన్వేషిస్తామని వివరించారు. కరోనా కట్టడిలో గతేడాది న్యూజిలాండ్ ఆదర్శంగా నిలిచింది. ప్రస్తుతం ఇక్కడ వారానికి సగటున ఐదు కొత్త కేసులు నమోదవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement