హైదరాబాద్, ఆంధ్రప్రభ : సికింద్రాబాద్-పూణే-సికింద్రాబాద్ శతాబ్ధి ఎక్స్ ప్రెస్ రైలులో కొత్తగా ఏర్పాటు చేసిన విస్టాడోమ్ కోచ్ ప్రయాణికులను ఆకర్షిస్తోంది. ఈకోచ్లో ప్రయాణించేందుకు ప్రయాణికులు పెద్ద సంఖ్యలో ఆసక్తి కనబరుస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వేలో విస్టాడోమ్ కోచ్‌తో నడిచే మొదటి రైలు సికింద్రాబాద్-పూణే- సికింద్రాబాద్ శతాబ్ది ఎక్స్ ప్రెస్ రైలు అని అధికారులు చెబుతున్నారు. విస్టా డోమ్ ప్రవేశపెట్టిన కొద్ది రోజుల్లోనే 63శాతం మంది ప్రయాణికులు ఈ కోచ్‌లో ప్రయాణించారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా నిలిపివేసిన సికింద్రాబాద్-పూణే-సికింద్రాబాద్ శతాబ్ధి ఎక్స్ ప్రెస్ రైలును పునరుద్దరించారు. ఈ నెల 10 నుంచి ఇరు వైపులా రైలును అందుబాటులోకి తీసుకొచ్చారు.
అదే సమయంలోలింక్హాఫ్మాన్ బుష్ కోచ్‌లతోపాటు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో విస్టాడోమ్ కోచ్ రావడంపై ప్రయాణికులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. శతాబ్ది ఎక్స్ ప్రెస్‌లో విస్టాడోమ్ కోచ్‌తోపాటు రెండు ఎగ్జిక్యూటివ్ తరగతి కోచ్‌లు, తొమ్మి ఏసీ చైర్ కారు కోచ్‌లు ఉన్నాయి. సికింద్రాబాద్ నుంచి పూణేకు విస్టాడోమ్ కోచ్‌లో ప్రయాణానికి రూ.2110ని ఛార్జీగా నిర్ణయించారు. ఎగ్జిక్యూటివ్ తరగతి కోచ్‌లో ప్రయాణానికి రూ.1935, క్యాటరింగ్ సౌకర్యం కోసం రూ.385 తీసుకుంటున్నారు. ఏసీ చెయిర్ కార్లో ప్రయాణానికి రూ.905 వసూలు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.