దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు కీలక అప్డేట్ ఇచ్చింది.. వేసవిలో రాకపోకలు పెరిగిన దృష్ట్యా అదనంగా ఎంఎంటీస్ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం నడుస్తున్న రైళ్లకు అదనంగా.. కొత్తగా 40 సర్వీసులను తీసుకురానున్నట్టు ప్రకటించింది. ఇందులో సికింద్రాబాద్ – మేడ్చల్ మధ్య 20 రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. మరో 20 రైళ్లు.. ఫలక్నుమా – ఉందానగర్ మధ్య నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. పాత, కొత్త సర్వీసులు అన్ని కలపి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నడిచే వాటి సంఖ్య 106కు చేరినట్లు అయింది.
40 కొత్త ఎంఎంటీఎస్ సర్వీసులు – వివరాలు
మరోవైపు ఎంఎంటీఎస్ రెండో దశపై కూడా ఫోకస్ పెట్టింది దక్షిణ మధ్య రైల్వే. 2024 జనవరి నాటికి పూర్తి రెండో దశను పూర్తి చేయాలని భావిస్తోంది. ఇప్పటికే 50 కిమీ మేర ఎంఎంటీఎస్ రెండో దశ అందుబాటులోకి రాగా.. మరో 50 కి.మీ లను జనవరి 2024 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2023 ఆరంభం నుంచి పనులు వేగవంతంగా సాగుతున్నాయి. సనత్నగర్- మౌలాలి మధ్య 21 కి.మీ., సికింద్రాబాద్-ఘట్కేసర్ మధ్య 19 కి.మీ., సీతాఫల్మండి- మౌలాలి- మల్కాజిగిరి మధ్య 10 కి.మీ. ఇలా మొత్తం 50 కి.మీ పూర్తి చేయనున్నారు.