Saturday, November 23, 2024

WTC Points table | సౌతాఫ్రికాపై న్యూజిలాండ్ విజయం.. భారత్ పై ఎఫెక్ట్ !

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) 2023-2025 సీజన్‌లో, మొదటి రెండు స్థానాల కోసం జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. విశాఖ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై భారత్ విజయం సాధించి డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఐదవ స్థానం నుంచి రెండో స్థానానికి చేరుకుంది. అయితే ఇప్పుడు మళ్లీ మూడో స్థానానికి పడిపోయింది. దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ విజయంతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో తాజా పరిణామం చోటు చేసుకుంది.

రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్ 281 ​​పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్ అగ్రస్థానానికి చేరుకుంది. అయితే న్యూజిలాంగ్ గెలుపుతో.. ఇప్పటికరకు రెండవ స్థానంలో ఉన్న భాతర్ జట్టు ఇప్పుడు మూడవ స్థానికి పడిపోగా.. అగ్రస్థాంలో ఉన్న ఆస్ట్రేలియా రెండవ స్థానికి పడిపోయింది.

న్యూజిలాండ్‌, ద‌క్షిణాఫ్రికా జ‌ట్ల మ‌ధ్య ఫిబ్ర‌వ‌రి 13 నుంచి రెండో టెస్టు మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఒక‌వేళ ఈ మ్యాచ్‌లో కివీస్ విజ‌యం సాదిస్తే అప్పుడు కివీస్ విజ‌య శాతం 75 శాతానికి చేరుకుంటుంది. ఇది టీమ్ఇండియాతో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జ‌ట్ల‌పై ప్ర‌భావాన్ని ఖ‌చ్చితంగా చూప‌నుంది.

- Advertisement -

ICC టెస్ట్ టీమ్ ర్యాంకింగ్

ఐసీసీ టెస్టు టీమ్ ర్యాంకింగ్ టేబుల్‌లో ఆస్ట్రేలియా జట్టు (4345 పాయింట్లు, 117 రేటింగ్‌తో) అగ్రస్థానంలో ఉంది. ఇక‌, ఆ తరువాతం భారత జట్టు (3746 పాయింట్లు, 117 రేటింగ్‌తో) రెండో స్థానంలో ఉంది. ఇంగ్లండ్ (4941 పాయింట్లు, 115 రేటింగ్‌తో) మూడో స్థానంలో ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement