న్యూజిలాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 18 ఏళ్లకు తీసుకోవాల్సిన ఓటు హక్కును 16 ఏళ్లకే ఇచ్చేలా, ఓటు హక్కు వయసును తగ్గిస్తూ కొత్త చట్టాన్ని రూపొందించబోతోంది. ఇటీవల ఆ దేశ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా జెసిండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం న్యూజిలాండ్ లో ఓటు హక్కును పొందాలంటే 18 ఏళ్ల వయసు ఉండాలి. ఈ కనీస వయసును 16 ఏళ్లకు తగ్గించబోతున్నారు. 18 ఏళ్లు దాటిన వారికే ఓటు హక్కును కల్పించడమనేది మానవ హక్కులను ఉల్లంఘించడమే అవుతుందని ఓ కేసులో సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. మరోవైపు ప్రధాని జెసిండ్ కూడా ఓటు హక్కు వయసును తగ్గించడానికి ఆసక్తిగా ఉన్నారు. ఈ బిల్లు పాస్ కావాలంటే 75 శాతం మంది ఎంపీలు పార్లమెంట్ లో ఆమోదించాలి.
Advertisement
తాజా వార్తలు
Advertisement