Tuesday, November 26, 2024

టీమిండియాకు కొరకరాని కొయ్యలా మారిన న్యూజిలాండ్

గత కొంతకాలంగా న్యూజిలాండ్ జట్టు టీమిండియాకు కొరకరాని కొయ్యలా మారింది. గతంలో ఆస్ట్రేలియా జట్టు మనపై ఆధిపత్యం చెలాయించేది. ఇప్పుడు అదే తరహాలో న్యూజిలాండ్ జట్టు టీమిండియా విజయాలకు అడ్డుగోడ అవుతోంది. ఎందుకంటే కొన్ని మ్యాచ్‌ల ఫలితాలే దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. 2019 వన్డే ప్రపంచకప్ సెమీస్‌లో భారత్ ఆశలపై నీళ్లు చల్లిన జట్టు న్యూజిలాండే. అంతేకాదు రెండు రోజుల కింద ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ టైటిల్‌కు కూడా మనకు అదే జట్టు అడ్డుగా నిలబడింది.

మరోవైపు ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్ టోర్నీలో భారత్ అగ్రస్థానంలో నిలిచినా మొత్తం ఐదు పరాజయాలను చవిచూసింది. వీటిలో మూడు పరాజయాలకు కారణంగా న్యూజిలాండ్ జట్టే. ఇలా ఐసీసీ ఈవెంట్లలో భారత్‌కు న్యూజిలాండ్ ప్రతిసారీ షాకులు ఇస్తూనే ఉంది. అయితే ఆయా పరాజయాల్లో టీమిండియా వైఫల్యాలను కాదనలేం. కానీ ఐసీసీ టోర్నీల్లో బాగా ఆడుతూ ఒక్క న్యూజిలాండ్ జట్టుకే మనవాళ్లు దాసోహం అయిపోతున్నారు. ప్రస్తుతం ప్రపంచ జట్లను చూస్తే న్యూజిలాండ్ జట్టు నానాటికీ బలంగా మారుతోంది. బౌలింగ్, బ్యాటింగ్, ఆల్‌రౌండర్ విభాగాల్లో ఆ జట్టుకు నాణ్యమైన ఆటగాళ్లు ఉన్నారు. ఈ కారణంగానే 2019 ప్రపంచకప్ ఫైనల్‌లోనూ ఇంగ్లండ్ జట్టుతో సమానంగా పోరాడింది. అయితే దురదృష్టవశాత్తూ బౌండరీల కారణంగా ఇంగ్లండ్ టైటిల్ విన్నర్ అయినా సాంకేతికంగా న్యూజిలాండ్ జట్టు కూడా విజేతగానే క్రీడా పండితులు భావిస్తున్నారు.

(ఆంధ్రప్రభ క్రీడా విభాగం)

ఇది కూడా చదవండి: ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ విజేత న్యూజిలాండ్

Advertisement

తాజా వార్తలు

Advertisement