Tuesday, November 26, 2024

న్యూజిలాండ్‌- ఐర్లాండ్‌ టీ20 సిరీస్‌ కివీస్‌దే.. బ్రేస్‌వెల్‌కు హ్యాట్రిక్‌ వికెట్లు

ఐర్లాండ్‌ పర్యటనలో న్యూజిలాండ్‌ అద్భుతంగా రాణిస్తోంది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా జరిగిన ఐర్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్‌ 88 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇంకో మ్యాచ్‌ ఉండగానే 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇక మ్యాచ్‌లో క్రికెట్‌లో న్యూజిలాండ్‌ ఆల్‌రౌండర్‌ మైఖేల్‌ బ్రేస్‌వెల్‌ అరుదైన ఘనత సాధించాడు. తన కేరీర్‌లో వేసిని తొలి ఓవర్‌లోనే హ్యాట్రిక్‌ వికెట్లు సాధించిన మొదటి ఆటగాడిగా బ్రేస్‌వెల్‌ రికార్డు సృష్టించాడు. ఐర్లాండ్‌ ఇన్నింగ్స్‌ 14 ఓవర్‌ వేసిన బ్రేస్‌వెల్‌ మూడు, నాలుగు, ఐదు బంతుల్లో వరుస వికెట్లు తీసి తొలి హ్యాట్రిక్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక మ్యాచ్‌ విషయానికొస్తే… టాస్‌ గెలిచిన ఐర్లాండ్‌ ఫీల్డింగ్‌ ఎంచుకోగా, న్యూజిలాండ్‌ తొలుత బ్యాటింగ్‌ చేసింది.

క్లీవర్‌ 78 పరుగులతో రాణించడంతో కివీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. అనంతరం 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్‌ 91 పరుగులకే కుప్పకూలింది. న్యూజిలాండ్‌ బౌలర్లలో ఇష్‌ సోధి, మైఖేల్‌ బ్రేస్‌వెల్‌ చెరో మూడు వికెట్లతో చెలరేగగా… జాకబ్‌ డఫీ రెండు, లాకీ ఫెర్గూసన్‌ ఒక వికెట్‌ సాధించాడు. ఐర్లాండ్‌ బ్యాటర్లలో మార్క్‌ అడైర్‌ 27 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. 78 పరుగులో రాణించిన న్యూజిలాండ్‌ వికెట్‌ కీపర్‌ క్లీవర్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాన్‌ వరించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement