Tuesday, November 26, 2024

ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరంగా న్యూయార్క్‌.. తర్వాతి స్థానాల్లో వాషింగ్టన్‌, శాన్‌ఫ్రాన్సిస్‌కో..

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వ్యాపార పర్యటనల గమ్యస్థానంగా 2022 సంవత్సరానికి గాను న్యూయార్క్‌ నగరం నిలిచింది. కొవిడ్‌ మహమ్మారి కారణంగా గత ఏడాది వ్యాపార ప్రయాణ ఖర్చులు 8 శాతం పెరిగాయి. ఫలితంగా నాలుగు నక్షత్రాల హోటళ్లు, భోజనం, టాక్సీలు, పానియాల ధరలు భారీగా పెరగడంతో న్యూయార్క్‌ వ్యాపర పర్యటనల గమ్యస్థానంలో నిలిచింది. వ్యాపార నిమిత్తం ప్రయాణించే వారు రోజుకు 796 డాలర్ల చొప్పున ఖర్చు చేయాల్సి వస్తుంది ఓ నివేదిక పేర్కొంది. అంటే భారత కరెన్సీలో రూ. 65,735లు ఖర్చవుతుందన్న మాట.

యుఎస్‌ నగరాలు అగ్ర స్థానంలో నిలిచాయి. న్యూయార్క్‌, వాషింగ్టన్‌ డీసీ, శాన్‌ఫ్రాన్సిస్‌కోతో పాటు స్విట్జర్లాండ్‌లోని జెనివా, జ్యురిచ్‌ తర్వాతి స్థానాలను ఆక్రమించాయి. ప్రయాణ వ్యయం పెరగడానికి ద్రవ్యోల్బణం పెరగడం ప్రధాన కారణం. టాప్‌ 10 లండన్‌, ప్యారిస్‌లు ఉండగా, హాంకాంగ్‌ ఆసియాలో అత్యంత ఖరీదైన నగరంగా నిలిచింది. ఇక్కడ సగటు రోజువారి ఖర్చులు 520 డాలర్లు. సింగపూర్‌ కంటే 5 డాలర్లు ఎక్కువగా ఉంది. అంగోలాలోని లువాండ నగరం అత్యంత ఖరీదైన ప్రాంతంగా ఆఫ్రికాలో నిలిచింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement