Monday, November 18, 2024

New Year Celebrations: కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టిన న్యూజిలాండ్

అన్ని దేశాల కంటే ముందే న్యూజిలాండ్ ప్రజలు నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టారు. న్యూజిలాండ్ నూతన సంవత్సరాదికి స్వాగతం పలుకుతోంది. పసిఫిక్ మహాసముద్రంలోని న్యూజిలాండ్ దీవులు 2024లోకి ప్రవేశించాయి. న్యూజిలాండ్ లోని ఆక్లాండ్ లో న్యూ ఇయ‌ర్ వేడుక‌లు ప్రారంభ‌మ‌య్యాయి. న్యూజిలాండ్ కాలమానం ప్రకారం అర్ధరాత్రి 12 గంటలు కాగానే బాణసంచా వెలుగుజిలుగులతో ఆకాశం మిరుమిట్లు గొలిపింది. ఆక్లాండ్ సహా న్యూజిలాండ్ ప్రధాన నగరాల్లో ప్రజలు సంబరాలు షురూ చేశారు.

కాగా, ప్రపంచంలో అన్ని దేశాల కంటే ముందుగా సమోవా, కిరిబాటి దీవులు కొత్త సంవత్సరంలోకి అడుగుపెడతాయి. అటు, మానవ ఆవాసయోగ్యం కాని హోలాండ్, బేకర్ దీవులకు చిట్టచివరిగా కొత్త సంవత్సరం వస్తుంది. సమోవా దీవుల్లో నూతన సంవత్సర వేడుకలు ప్రారంభమైన 26 గంటల తర్వాత ఈ రెండు దీవులు కొత్త సంవత్సరంలోకి ప్రవేశిస్తాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement