కొద్ది రోజుల క్రితం ఎన్నికల సంఘం ‘మేరా పెహ్లా ఓట్ – దేశ్ కే లియే’ అనే ప్రచారాన్ని ప్రారంభించిందని మొదటి సారి ఓటర్లు రికార్డు సంఖ్యలో ఓటు వేయాలని పిలుపునిచ్చారు ప్రధాని నరేంద్రమోదీ. ప్రధానిగా మోడీ రెండో టర్మ్ లో నేడు చివరి మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, వ్యక్తుల నైపుణ్యాలు , ప్రతిభను ప్రదర్శించడంలో సోషల్ మీడియా చాలా సహాయపడుతోందని అన్నారు.
భారతదేశంలోని యువకులు కంటెంట్ క్రియేషన్ రంగంలో అద్భుతాలు చేస్తున్నారని ప్రశంసించారు… వారి ప్రతిభను గౌరవించేందుకు, నేషనల్ క్రియేటర్స్ అవార్డు ప్రారంభించామని చెప్పారు. ఇక మార్చి 8వ తేదీన మనం ‘మహిళా దినోత్సవం’ జరుపుకోనున్నామన అంటూ ఈ ప్రత్యేకమైన రోజున దేశ అభివృద్ధి ప్రయాణంలో స్త్రీ శక్తి సహకారానికి సెల్యూట్ చేయడమే వారికి మనం ఇచ్చే బహుమతి అన్నారు. మహిళలకు సమాన అవకాశాలు లభించినప్పుడే ప్రపంచం అభివృద్ధి చెందుతుందని మహాకవి భారతియార్ అన్నారని కోట్ చేశారు. నేడు భారతదేశ మహిళా శక్తి అన్ని రంగాలలో పురోగతి యొక్క కొత్త శిఖరాలను తాకుతోంది అని అన్నారు.
మూడు నెలలు మన్ కీ బాత్ కి బ్రేక్
ఈ సందర్భంగా వివిధ రంగాల్లో నైపుణ్యం సాధించిన, కృషి చేస్తున్న వారితో ప్రధాని ఈ సందర్భంగా సంభాషించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ‘మన్ కీ బాత్’ ప్రసారాలు రాబోయే 3 నెలల పాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు