భారతదేశంలో vivo Y-సిరీస్ నుంచి సరికొత్త vivo-Y100 రిలీజ్ అయింది. ఈ ఫోన్ FHD+ రిజల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.38-అంగుళాల అమోలెడ్ (AMOLED) డిస్ప్లేను అందిస్తుంది. ప్యానెల్ 1,300 nitsతో హై బ్రైట్ నెస్ సపోర్ట్ చేస్తుంది. అంతే కాకుండ, పసిఫిక్ బ్లూ అండ్ ట్విలైట్ గోల్డ్ కలర్ తో వివో Y100 వేరియంట్స్ లో బ్యాక్ సైడ్ కలర్ చేంజ్ చేసే ఫ్లోరైట్ AG గ్లాస్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ UV రేస్ కి ఎక్స్ పోజ్ అయినప్పుడు కలర్ చేంజ్ అవ్వడాన్ని గమనించవచ్చు.
ఇక, వెనుక భాగంలో OISతో 64 MP మేయిన్ కెమెరా అలాగే 2MP మాక్రో క్యామ్, 2MP డెప్త్ మాడ్యూల్స్ ఉన్నాయి. మిడ్ టెక్ (MediaTek) డైమెన్సిటీ 900 సిస్టమ్ చిప్‌లో 8GB RAM అండ్ 128GB స్టోరేజ్ ఉంటుంది, ఫోన్ లో మైక్రో SD స్లాట్ కూడా ఉంది దీని ద్వారా మరింత స్టోరేజ్ ఎక్స్ పాండ్ చేసుకోవచ్చు. ఈ ఫోన్ Android 13 ఆధారంగా Funtouch OS 13ని బూట్ చేస్తుంది. 44W ఫాస్ట్ చార్జ్ తో 4,500 mAh బ్యాటరీని అందిస్తుంది.
ఇతర ఫీచర్లలో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, IP54 రేటింగ్ అండ్ హైబ్రిడ్ డ్యూయల్ సిమ్ స్లాట్ ఉన్నాయి. ఈ vivo Y సిరీస్ Y100 వేరియంట్.. పసిఫిక్ బ్లూ, ట్విలైట్ గోల్డ్ అండ్ మెటల్ బ్లాక్ కలర్స్ లో అందుబాటులో ఉంది. 8/128GB ప్రారంభ ధర INR 24,999తో అందుబాటులో ఉంది. ఇక ఈ ఫోన్ ని vivo అఫీషియన్ వెబ్‌సైట్‌తో పాటు ఇతర ఈకామర్స్ వెబ్సైట్ అండ్ ఆన్లైన్ రిటైలర్స్ నుండి ఆర్డర్ చేయవచ్చు.