Friday, November 22, 2024

కొత్త వైరస్‌ టొమాెెటో ఫ్లూ, 82 కేసులు నమోదు.. కేరళ, ఒడిశాల్లో కలకలం

భారతీయ చిన్నారుల్లో హ్యాండ్‌ ఫుట్‌ మౌత్‌ డిసీజ్‌ (హెచ్‌ఎఫ్‌ఎండి) లేదా టొమాెెటో ఫ్లూ వైరస్‌ వేగంగా వ్యాపిస్తోందని, ఇది అత్యంత తీవ్రమైన అంటువ్యాధని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. కొవిడ్‌ నాలుగో దశలో టొమాెెటో ఫీవర్‌ చిన్నారుల్లో వేగంగా వ్యాపిస్తున్నట్ల ప్రముఖ మెడికల్‌ జర్నల్‌ లాన్సెట్‌ రెస్పిరేటరీ ఒక కథనంలో హెచ్చరించింది. డాక్టర్ల వెల్లడించిన సమాచారం ప్రకారం ఇండియాలో ఇప్పటి వరకు ఐదేళ్ల లోపు చిన్నారుల్లో 82 టొమేటా ఫీవర్‌ కేసులు నమోదు కాగా, మొట్టమొదటి టొమాెెటో ఫీవర్‌ కేసు ఈ ఏడాది మే 6వ తేదీన కేరళలోని కొల్లామ్‌లో నమోదైందని తెలిపింది. పెద్దవారిలో ఈ వైరస్‌ అత్యంత అరుదుగా సోకుతుందని వెల్లడించింది.

పేషెంట్ల శరీరంపై మొదట చిన్న సైజు ఎరుపు రంగు దద్దుర్లు ఏర్పడి క్రమంగా అది టొమాెెటో సైజులో పెరుగుతుంది. ఈ వైరస్‌ లక్షణాలు ప్రధానంగా అలసట, కీళ్ల నొప్పులు, పొట్ట నొప్పి లేదా లుంగలు చుట్టుకు పోవడం, వాంతులు, డయేరియా, దగ్గు, ముక్కుదిబ్బడం, అధిక జ్వరం, నొప్పుల వంటి చికెన్‌గున్యా లక్షణాలు ఉంటాయని ఆ కథనంలో తెలిపింది. ఈ ఫీవర్‌కు ప్రస్తుతం ఎలాంటి వ్యాక్సిన్‌ అందుబాటులో లేదని, ఈ వ్యాధి కేరళ, ఒడిషా, తమిళనాడు రాష్ట్రాల్లోని చిన్నారులకు నమోదైనట్లు లాన్సెట్‌ జర్నల్‌ వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement