- కేబీఆర్ పార్కు చుట్టూ ఆరు జంక్షన్లు
- రెండు ప్యాకేజీల్లో పనులు
- మొదటి ప్యాకేజీ రూ.421 కోట్లు
- రెండవ ప్యాకేజీ రూ.405 కోట్లు
- పరిపాలనా అనుమతులిచ్చిన ప్రభుత్వం
- పురపాలక పట్టణాభివృద్ధి శాఖ జీవో జారీ
హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరానికి గుండెకాయ లాంటి కాసు బ్రంహ్మానందరెడ్డి పార్కు చేట్టూ సరికొత్త హంగులతో ఆరు వంతెనలు, వాటికి అనుబంధంగా ఆరు అండర్‌పాస్‌లను నిర్మించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. రెండు ప్యాకేజీల్లో ఈ పనులను చేపట్టాలని ముఖ్యమంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు.
మొదటి ప్యాకేజీలో రూ.421 కోట్లతో, రెండవ ప్యాకేజీలో రూ.405 కోట్లతో పనులను చేపట్టనున్నారు. అందుకోసం ప్రభుత్వం పరిపాలనా పరమైన అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ శుక్రవారం జీవో జారీ చేసింది. కేబీఆర్ పార్కు చుట్టూ ్లఫఓవర్లు, అండర్ పాస్‌లను నిర్మించడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిపోవడంతో పాటు మహానగరం సరికొత్త అందాలను సొంతం చేసుకోనుంది.
హైదరాబాద్ మహా నగరానికి నడిబొడ్డున ఉన్న కేబీఆర్ చుట్టూ నిత్యం భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. దీంతో వాహనాదారులు తీవ్ర పడుతుంటారు. అయితే, నగరంలోని ప్రధాన ప్రాంతాలకు వెళ్లాలంటే ఈ పార్కు నుంచే వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సరికొత్త ప్రణాళిక రూపొందించింది.
ఇందులో భాగంగానే కాసు బ్రహ్మానంద రెడ్డి నేషనల్ పార్క్ చుట్టూ అండర్ పాస్‌లు, ్లఫఓవర్లు, సిగ్నళ్లు, యూటర్న్‌లు లేకుండా చర్యలు చేపట్టింది. 826 కోట్ల రూపాయలతో ఆరు జంక్షన్లను అభివృద్ధి చేసేందుకు పాలనాపరమైన తెలంగాణ ప్రభుత్వం అనుమతులిచ్చింది.
రూ. 421 కోట్లతో ప్యాకేజీ-1లో జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు జంక్షన్
- రోడ్డు నెం.45 నుంచి కేబీఆర్ పార్కు యూసఫ్‌గూడ వైపు వై ఆకారంలో అండర్‌పాస్.
- కేబీఆర్ పార్కు ప్రవేశం నుంచి రోడ్డు నెం.36 వరకు నాలుగు లైన్ల ఫ్లైపఓవర్.
- యూసఫ్‌గూడ వైపు నుంచి రోడ్డు నెం.45 జంక్షన్ వరకు రెండు లైన్ల ఫ్లైఓవర్.
కేబీఆర్ ఎంటెన్స్ ముగ్ధ జంక్షన్
- జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు నుంచి క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్ వరకు 2 లేన్ల అండర్‌పాస్
- పంజాగుట్ట వైపు నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వరకు మూడు లేన్ల ్లపఓవర్
- కేబీఆర్ ఎం-టె-న్స్ జంక్షన్ నుంచి పంజాగుట్ట వైపు మూడు లేన్ల అండర్ పాస్
405కోట్లతో ప్యాకేజీ-2లో.. రోడ్ నెం.45 జంక్షన్
- ఫిల్మ్ నగర్ జంక్షన్ నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వైపు వరకు అండర్ పాస్-
- జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు నుంచి రోడ్ నెంబర్-45 వరకు రెండు లైన్ల ్లఫఓవర్
ఫిలింనగర్ జంక్షన్
- అగ్రసేన్ జంక్షన్ నుంచి రోడ్ నెం.45 జంక్షన్ వరకు 2 లైన్ల అండర్‌పాస్
- ఫిలింనగర్ జంక్షన్ నుంచి అగ్రసేన్ జంక్షన్ వరకు రెండు లైన్ల ్లఫఓవర్
మహారాజా అగ్రసేన్ జంక్షన్
- క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్ నుంచి ఫిలింనగర్ జంక్షన్ వరకు అండర్ పాస్
- ఫిలింనగర్ జంక్షన్ నుంచి రోడ్ నెంబర్-12 వరకు రెండు లైన్ల ్లఫఓవర్
క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్
- కేబీఆర్ పార్కు నుంచి అగ్రసేన్ జంక్షన్ వరకు రెండు లైన్ల అండర్ పాస్