రియాద్: కరోనా కొత్త వేరియెంట్ బోట్స్ వానా కలవరంతో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుముఖం పట్టాయి. శుక్రవారం ఏకంగా 4 శాతం మేర తగ్గిన బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ 80 డాలర్ల దిగువకు పడిపోయింది. కరోనా కొత్త వేరియెంట్ ప్రభావంతో ఆర్థిక వ్యవస్థలు నెమ్మదిస్తాయని, ప్రయాణాలపై ఆంక్షలు కూడా పెరుగుతాయని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామాలు ఆయిల్ డిమాండ్ ను బలహీనం చేస్తాయి.
కాబట్టి క్రూడ్ ఆయిల్ పై పెట్టుబడుల ఉపసంహరణకు ఇన్వెస్టర్లు మొగ్గుచూపారు. శుక్రవారం పతనంతో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ వరుసగా మూడవ రోజు పతనమైనట్టయింది. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 79.06 డాలర్లకు పడిపోగా.. యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియెట్(డబ్ల్యూటీఐ) క్రూడ్ 3.45 డాలర్లు లేదా 4.4 శాతం తగ్గి 74.94 డాలర్లకు దిగొచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ తగ్గుదల దేశీయంగా రిటైల్ ఇంధన ధరలను ఎంతమేర ప్రభావితం చేస్తుందో వేచిచూడాల్సి ఉంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital