ప్రభన్యూస్ : భారత సైన్యం వచ్చే ఏడాది నుంచి తమ సిబ్బంది కోసం తేలికపాటి, వాతావరణ అనుకూల పోరాట యూనిఫామ్‌ను ప్రవేశపెట్టనుంది. కొత్త యూనిఫాం ”డిజిటల్ డిస్ట్రప్టివ్” నమూనాపై ఆధారపడి ఉంటుంది. జనవరి 15న జరిగే ఆర్మీ డే పరేడ్‌లో వాటిని ప్రదర్శించనున్నారు. పలు దేశాల సైనిక దుస్తులపై విస్తృత విశ్లేషణల అనంతరం కొత్త యూనిఫాం ఖరారు చేసినట్లు సంబంధిత అధికారి తెలిపారు.
కొత్త యూనిఫాం మరింత మన్నికైనది గానూ, వేసవి, చలికాలంలోనూ సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. ఆలివ్, మట్టి రంగుల సమ్మేళనాన్ని కలిగి ఉండే యూనిఫాంలు, దళాల విస్తరణ ప్రాంతాలు, వారు పనిచేసే వాతావరణ పరిస్థితుల వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని రూపొందించబడ్డాయి. భారత నౌకాదళం కూడా గతేడాది యూనిఫాంను విడుదల చేసింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital