Wednesday, November 20, 2024

కేర‌ళ‌లో కొత్త రకం మ్యూటెంట్.. కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం

కేరళలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. కొద్ది రోజులుగా దేశం మొత్తంలో కేరళలోనే అధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. దేశంలో వస్తున్న మొత్తం కేసులలో కేరళ నుండి సగం కేసులు రావడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పుడు తాజాగా కేరళకు మరో తలనొప్పి మొదలైంది. కేరళ రాష్ట్రంలో కొత్తరకం మ్యూటెంట్‌ను వైద్య నిపుణులు గుర్తించారని తెలుస్తోంది. తొమ్మిది జిల్లాల్లో కొత్త మ్యూటెంట్ గుర్తించినట్లు వైద్య అధికారులు చెబుతున్నారు.

దాంతో కేంద్ర ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. పూర్తిస్థాయి నిర్ధారణ కోసం శాంపిల్స్‌ను జినో మిక్స్ కన్సార్టియానికి పంపాలని సూచించింది. ఇదిలా ఉంటే బుధవారం ఒక్కరోజే కేరళలో 22,500 కరోనా కేసులు నమోదయ్యాయి. అంతే కాకుండా రాష్ట్రంలో 116 మంది కరోనాతో మరణించారు. మరో వైపు కేరళ లో ఆర్ వ్యాల్యు ఒకటి కంటే ఎక్కువగా ఉంది. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 16 శాతం కంటే ఎక్కువ కొనసాగుతోంది. ఇక కరోనా అదుపు చేయడానికి కేరళ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోంది.

ఈ వార్త కూడా చదవండి: తెలంగాణలో విజృంభిస్తున్న డెల్టా వేరియంట్ కేసులు

Advertisement

తాజా వార్తలు

Advertisement