Wednesday, November 20, 2024

Delhi | ఎంబీబీఎస్ విద్యార్థులకు కొత్త పాఠ్య ప్రణాళిక.. రాజ్యసభలో వెల్లడించిన కేంద్రం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: వైద్య విద్యార్థుల కోసం నేషనల్ మెడికల్ కమిషన్  (ఎన్ఎంసీ) కొత్త బోధన ప్రణాళికకు సంబంధించిన మార్గదర్శకాలను ఈ ఏడాది ఆగస్టు 1న జారీ చేసినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ తెలిపారు.

రాజ్యసభలో మంగళవారం వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా సమాధానమిస్తూ.. కొత్త బోధన ప్రణాళిక కింద వృత్తిపరంగా మొదటి సంవత్సరంలో “కుటుంబ దత్తత కార్యక్రమం-లక్ష్యాలు అందుకోవడం” అనే పాఠ్యాంశంలో భాగంగా విద్యార్థులు ఆయా ప్రాంతాలకు సంబంధించిన గ్రామీణ స్థితిగతులను అర్థం చేసుకోవాల్సి ఉంటుందని మంత్రి తెలిపారు. కాంపిటెన్సీ బేస్డ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ పేరిట రూపొందించిన ఈ కొత్త బోధనా ప్రణాళికకు సంబంధించిన మార్గదర్శకాలు  జాతీయ మెడికల్ కమిషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు మంత్రి పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement