న్యూఢిల్లీ: మదర్సాలలో ఇకపై ప్రాచీనం భారత విజ్ఞానం, సంప్రదాయాలపై పాఠాలు బోధించనున్నారు.. ఈ మేరకు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ కింద ఓ కొత్త కోర్సును ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రవేశపెడుతోంది. మూడు, ఐదు, ఎనిమిదో తరగతుల కరికులమ్‌లో ఈ ప్రత్యేక పాఠాలు ఉంటాయి. దీని కోసం ప్రత్యేకంగా 15 ఆర్టికల్స్‌ను సిద్ధం చేశారు. వాటిలో వేదాలు, భగవద్గీత, రామాయణం, యోగా, సైన్స్, సంస్కృతంలాంటివి ఉన్నాయి. కాగా, ప్రస్తుతానికి 100 మదర్సాలలో ఈ కోర్సు ప్రవేశపెడుతున్నామని, భవిష్యత్తులో దీనిని 500లకు తీసుకు వెళ్లనున్నట్లు ఎన్ఐఓఎస్ చైర్మన్ సరోజ్ శర్మ వెల్లడించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement