Monday, November 18, 2024

తెలంగాణలో మరో ఆరు ఎయిర్ పోర్టులు

తెలంగాణలో కొత్త ఎయిర్ పోర్టులు ఏర్పాటు కానున్నాయి. తెలంగాణలో ప్రస్తుతం రెండు ఎయిర్ పోర్టులు ఉన్నాయి. కొత్తగా మరో 6 విమానాశ్రయాల ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ జరుగుతోందని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా సమాధానం ఇచ్చారు.

‘నిజామాబాద్‌ జిల్లా జక్రాన్‌పల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ, మహబూబ్‌నగర్‌ జిల్లాలో మొత్తం మూడు గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టులకు, వరంగల్‌ జిల్లా మామునూరు, పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్, ఆదిలాబాద్‌లో మొత్తం మూడు బ్రౌన్‌ ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టులకు వచ్చిన ప్రతిపాదనలపై టెక్నో ఎకనామిక్‌ ఫీజిబిలిటీ స్టడీ రిపోర్ట్‌ను ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(AAI) పూర్తి చేసింది. ఈ నివేదికను ఈ నెల 7న తెలంగాణ ప్రభుత్వానికి AAI సమర్పించింది. ప్రతిపాదిత మూడు గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టులకు సంబంధించిన స్థల ఎంపిక అనుమతులను ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఇంకా కేంద్ర పౌర విమానయాన శాఖకు ఇవ్వలేదు’ అని పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా చెప్పారు.

ఈ వార్త కూడా చదవండి: తెలంగాణలో ఉపఎన్నికలు వస్తేనా అభివృద్ధి చేస్తారా?

Advertisement

తాజా వార్తలు

Advertisement