Friday, November 22, 2024

New Rules – పోస్టల్‌ బ్యాలెట్ నిబంధనలు ఇక క‌ఠినం…

న్యూఢిల్లీ – ఎన్నికల విధుల్లో పాల్గొనే వివిధ శాఖల సిబ్బంది తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ విధానాన్ని ప్రవేశపెట్టింది. కొన్ని సమయాల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు సైతం అభ్యర్థి గెలుపోటములపై ప్రభావం చూపుతాయి. అయితే ఎన్నికల సమయంలో పోస్టల్ బ్యాలెట్ ను తమ వద్దే ఉంచుకుని రాజకీయ పార్టీలతో ఉద్యోగులు బేరాలు సాగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఒక్కో సారి రాజకీయ పార్టీలే పోస్టల్ బ్యాలెట్లను తమ చేతుల్లోకి తీసుకుని ఓటు వేసుకున్న ఘటనలు కూడా అనేకం ఉన్నాయి.

పోస్టల్ బ్యాలెట్లు దుర్వినియోగం అవుతున్నాయని గ్రహించిన ఎన్నికల సంఘం తాజాగా నిబంధనల్లో పలు మార్పులు చేసింది. మారిన నిబంధనల ప్రకారం ఉద్యోగులు తమ పోస్టల్ బ్యాలెట్ ను తమ వద్దే ఉంచకోకుండా.. తమకు కేటాయించిన కేంద్రంలో రిటర్నింగ్ అధికారికి సమర్పించాల్సి ఉంటుంది. పోలింగ్ విధులు నిర్వర్తించే చోటే ప్రత్యేకంగా పోస్టల్ బ్యాలెట్ కేంద్రం ఏర్పాటు చేయనుంది. ఆ కేంద్రంలో ఉద్యోగులు తమ పోస్టల్ బ్యాలెట్ ఓటు వినియోగించుకునే అవకాశం ఉంది. ఎన్నికల్లో విధులు నిర్వర్తించే ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేందుకు ఫారం-12, ఫారం 12ఏ ను శిక్షణ సమయంలోనే అందిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement