ఏప్రిల్ 1 నుంచి 2023-24 ఆర్ధిక సంవత్సరం ప్రారంభం కానుంది. బడ్జెట్‌లో పన్నులు పెంచిన కొన్నింటి ధరలు పెరగనున్నాయి. మరికొన్నింటి ధరలు తగ్గనున్నాయి.
ధరలు పెరిగేవి…
ఏప్రిల్ 1 నుంచి ప్రధానంగా ప్లాస్టిక్ వస్తువులు, బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, ప్లాటినం నగల ధరలు పెరుగుతాయి. వీటితో పాటు ఇమిటేషన్ నగలు, ఎలక్ట్రిక్ కిచెన్ చిమ్నీలు, సిగరేట్లు, ప్రైవేట్ జెట్స్, హెలికాప్టర్లు, దిగుమతి చేసుకునే ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు పెరగనున్నాయి.
ధరలు తగ్గనున్నవి…
ప్రధానంగా ఏప్రిల్ 1 నుంచి టీవీలు, వజ్రాలు, రంగురాళ్లు, సైకిళ్లు, ఇంగువ, కాఫీ గింజలు, మొబైల్ ఫోన్లు, ఫోన్ ఛార్జర్లు, దుస్తులు, బొమ్మలు, శీతలీకరించిన నత్తగుల్లలు, కెమెరా లెన్స్‌లు, మన దేశంలో తయారైన ఎలక్ట్రిక్ వాహనాలు, పెట్రోలియం ఉత్పత్తులకు అవసరమయ్యే కొన్ని రకాల రసాయనాలు, లిథియం అయాన్ బ్యాటరీలు ఉన్నాయి.