Friday, November 22, 2024

New Rule – ఆ బీచుల్లో రాళ్లు ఎత్తుకెళ్తే ఫైన్

అమెరికాలోని న్యూయార్క్ స్టేట్ ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. బీచ్​లో ఎవరైనా రాళ్లు తీసుకెళ్తే భారీ జరిమానా విధించడానికి సిద్ధమైంది. న్యూయార్క్ లో అందమైన బీచులున్నాయి. కానరీ దీవుల్లోని లాంజారోట్, ఫ్యూర్టెవెంచురా సందర్శించే పర్యాటకులను బీచ్ ల నుంచి ఇసుక, రాళ్లను తీసుకెళ్లవద్దని హెచ్చరిస్తున్నారు. ఇలా చేస్తే 128 పౌండ్ల (రూ.13478) నుంచి 2,563 పౌండ్ల (రూ.2,69879) వరకు (2 లక్షల వరకు) భారీ జరిమానా విధించవచ్చని న్యూయార్క్ స్టేట్ ప్రభుత్వం పేర్కొంది.

బీచుల్లో రాళ్లతో పాటు ఇతర పదార్థాలను తీసుకెళ్లడం ద్వారా హానికరమైన ప్రభావం పడుతోంది. ప్రతి సంవత్సరం బీచ్ల నుండి సుమారు ఒక టన్నుల రాళ్లు, ఇసుకను కోల్పోతుందని అధికారులు గుర్తించారు. రాళ్లను తొలగించడం తీరప్రాంతాల సహజ సమతుల్యతను దెబ్బతీస్తుంది. వాటిని ప్రమాదంలోకి నెడుతుంది. పర్యాటకం కారణంగా కానరీ దీవులు ప్రమాదకర దశకు చేరుకుంటాయన్న ఆందోళనల మధ్య ఈ కఠినమైన రూల్స్ అమలవుతున్నాయి. పర్యాటకుల వినియోగం వనరులను దెబ్బతీస్తుందని కొందరు అధికారులు ఆరోపించడం ఈ రూల్స్ అమలవుతున్నాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement