Sunday, January 19, 2025

TG | అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు : మంత్రి ఉత్తమ్

రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ కోసం గ్రామాల్లో సర్వే వేగంగా కొనసాగుతోంది. జ‌న‌వ‌రి 26న రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేయ‌నుంది. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుభవార్త వినిపించారు. శనివారం (జనవరి 18న) మీడియాతో మాట్లాడిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి..

రాష్ట్రంలో అర్హత ఉన్న అందరికీ కొత్త రేషన్ కార్డులు ఇస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. పాత రేషన్ కార్డులు తీసేస్తారని జరుగున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని స్ప‌ష్టం చేశారు. పాత రేషన్ కార్డులు అలాగే ఉంటాయని అన్నారు. పాత రేషన్‌ కార్డుల్లో కొత్త సభ్యులను చేరుస్తామని కూడా చెప్పుకొచ్చారు.

కులగణన ఆధారంగానే రేషన్ కార్డుల ప్రక్రియ ఉంటుందని మరోసారి తెలిపారు. అయితే.. ప్రస్తుతం ప్రకటిస్తున్న జాబితాల్లో పేర్లు లేకపోతే ఎలాంటి ఆందోళన చెందొద్దని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గ్రామ సభల్లో మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. అంతేకాకుండా రేషన్ కార్డులు పంపిణీ అనేది నిరంతర ప్రక్రియ అని ఉత్తమ్ చెప్పుకొచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement