Saturday, January 11, 2025

Canada PM | మార్చి 9న కెనడాకు కొత్త ప్రధాని..

కెనడా రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ దేశ ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో తన పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. ట్రూడో రాజీనామా నిర్ణయంతో కెనడాలో తదుపరి ప్రధాని ఎవరన్న ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో లిబరల్ పార్టీ కీలక ప్రకటన చేస్తూ.. మార్చి 9న కొత్త నాయకుడిని ఎన్నుకుంటామని తెలిపింది.

ట్రూడో రాజీనామాతో కొత్త ప్రధాని ఎంపిక చేయడానికి లిబరల్ పార్టీ లోపల వివిధ కసరత్తులు జరుగుతున్నాయి. “లిబరల్ పార్టీ ఆఫ్ కెనడా మార్చి 9న కొత్త నాయకత్వాన్ని ఎన్నుకోనుంది. 2025 ఎన్నికల్లో విజయాన్ని సాధించేందుకు సిద్ధంగా ఉంది” అని ఆ పార్టీ అధ్యక్షుడు సచిత్ మెహ్రా ప్రకటనలో తెలిపారు.

- Advertisement -

ప్రధాన పోటీదారుగా అనితా ఆనంద్

కాగా, కెన‌డా ప్రధాన మంత్రి పదవి రేసులో ఐదుగురి పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో భారతీయ మూలాలు కలిగిన అనితా ఆనంద్ ప్రధాన పోటీదారుగా ఉన్నారు. 57 ఏళ్ల అనిత ప్రస్తుతం కెనడా రవాణా శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. ఆమె తల్లిదండ్రులు భారత్ నుంచి వలస వెళ్లి, నోవా స్కోటియాలో స్థిరపడ్డారు.

అనిత ఆనంద్ తో పాటు భారతీయ మూలాలు కలిగిన ఎంపీలు జార్జ్ చాహల్, చంద్ర ఆర్య, ఉప ప్రధాని క్రిస్టియా ఫ్రీలాండ్, ఆర్థిక నిపుణుడు మార్క్ కార్నే కూడా ఈ రేసులో ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement