Thursday, November 21, 2024

అమెజాన్‌ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌కి నేటి నుంచి కొత్త ధరలు..

ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ అమెజాన్‌ తన ప్రైమ్‌ మెంబర్‌ షిప్‌ ధరలను నేటి నుంచి పెంచనుంది. డిసెంబర్‌ 14 (నేటి నుంచి) భారత్‌లో ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ ధర 50 శాతం పెంచేందుకు నిర్ణయించింది. అక్టోబర్‌లో ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ ఫీజులను పెంచుతున్నట్టు అమెజాన్‌ ప్రకటించింది. యూఎస్‌ ఈ కామర్స్‌ దిగ్గజం దానికి సంబంధించిన తేదీని అప్పుడు వెల్లడించలేదు. సోమవారం పెంపు తేదీని ప్రకటించింది. అమెజాన్‌ ప్రైమ్‌ వార్షిక సభ్యత్వం ఇప్పుడు రూ.999 ఉంది. దీన్ని రూ.1499కు పెంచుతోంది.

కస్టమర్‌లు తమ సబ్‌స్క్రిప్షన్‌ను పాత ధరలకు (అంటే సంవత్సరానికి రూ.999) డిసెంబర్‌ 13 అర్దరాత్రి వరకు చేసుకోవచ్చు. అమెజాన్‌ కొత్త ధరలు నెలవారీ, త్రైమాసిక, వార్షిక ప్యాక్‌లన్నింటికీ వర్తిస్తాయి. అమెజాన్‌ ప్రైమ్‌ నెలవారీ ప్లాన్‌ ఇప్పుడు రూ.129 ఉంటే.. రూ.179కు పెరగనుంది. మూడు నెలల ప్యాక్‌ను రూ.329 నుంచి రూ.459కు పెంచుతోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement