హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో నియామకాలు, ఉద్యోగ భర్తీ ప్రక్రియలో టీఎస్పీఎస్సీని మరింత బలోపేతం చేసి పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పేపర్ లీకేజీలతో అప్రతిష్టను మూటగట్టుకున్న టీఎస్పీఎస్సిని బలోపేతం చేసి, అవకతవకలకు ఆస్కారం లేకుండా సర్కార్ దిద్దుబమాటు చర్యలు తీసుకుంటోంది. టీఎస్పీఎస్సీ బాద్యతలను మరింత పెంచే క్రమంలో భాగంగా 10 నూతన పోస్టులను క్రియేట్ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇందులో భాంగా ఒక కంవట్రోలర్ ఆఫ్ ఎగ్జిమినేషన్స్, డిప్యుటీ కంట్రోలర్, అసిస్టెంట్ కంట్రోలర్, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్, సీనియర్ నెట్వ ర్క్ అడ్మినిస్ట్రేటర్, జూనియర్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, సీనియర్ ప్రోగ్రామర్, జూనియర్ ప్రోగ్రామర్, లా ఆఫీసర్(జూనియర్ సివిల్ జడ్జి క్యాడర్)లో పోస్టులను క్రియేట్ చేసింది. ఈ మేరకు జీవో 37ను జారీ చేశారు.
టీఎస్పీఎస్సీ పంపిన ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించడంతో కొత్త పోస్టులకు ఆమోదం లభించింది. కాగా టీఎస్పీఎస్సీ అదనపు కార్యదర్శిగా ఐఏఎస్ అధికారిని నియమించారు. బీఎం సంతోష్‌ను అదనపు కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన ఇకమీదట పరీక్షల కంట్రోలర్‌గా వ్యవహరిస్తారు. ఔటర్ రింగ్‌రోడ్డు ప్రాజెక్ట్ డైరెక్టర్ బాధ్యతలనుంచి వైదొలిగిన ఆయన నూతన బాధ్యతలను స్వీకరించారు.