ప్రభ న్యూస్ : కారు ఆగిందంటూ కథలు చెబుతూ ఫోన్ కాల్ వస్తుంది. ఈ సంభాషణలో తెలిసిన వారి పేరుచెప్పి ఆపదలో ఉ న్నాం ఆదుకోండి అంటూ అడ్డాకు వచ్చి అడ్డంగా మోసం చేస్తు న్నారు. జిల్లా పరిధిలోని పలు మండలాల్లో గత మూడు మాసాలుగా గుర్తు తెలియని ఫోన్ నెంబర్ నుండి ఫోన్‌కాల్ రావడం, సదరు వ్యక్తి ఎదుటి వ్యక్తితో ఫోన్ కాల్‌లో సంభాషిస్తూ ఇలా మాట్లాడుతారు.. నా ఫ్యామిలీ కార్‌లో మీ దారిలోనే వచ్చాం. మధ్యలోనే ట్రబుల్ ఇచ్చింది అక్కడ ఆగిపోయాం. అందులో మహిళలు, చిన్నారులు ఉన్నారు. నేను మీకు తెలిసిన వ్యక్తి చుట్టాన్ని అని స్నేహితుని పేరు చెప్పి రూ.5 వేలు, రూ.10 వేలు డిమాండ్ చేస్తున్నారు. అంతలోనే ఫోన్ కట్ అవడం, క్షణాల్లోనే మరో వ్యక్తి ఫోన్ స్వీకరించిన వ్యక్తి దగ్గరికి రావడం, సదరు మోసపు వ్యక్తి చెప్పిన కథనాన్ని అంతా చెప్పి నమ్మించి మాటల్లో పెట్టి వేల రూపాయలు దండుకుంటున్నారు.
ఇలాంటి ఘటనే మహబూబ్‌నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండలంలో చోటు చేసుకుంది. గత సెప్టెంబర్‌లో మహమ్మదాబాద్ మండలంలో మీసేవా కేంద్రం నిర్వహిస్తున్న ఓ వ్యక్తికి గుర్తు తెలియని ఫోన్ నెంబర్ ద్వారా ఫోన్ కాల్ వచ్చింది. ఈ సంభాషణలో పరిచయం ఉన్న వ్యక్తి మాదిరి మాట్లాడుతూ.. అందుబాటులో ఉన్న నమ్మిన స్నేహితులు, బంధువుల పేరుచెప్పి రూ.5వేలు కాజేశారు. ఆ ఘటన గడిచిన మూడు మాసాలకు ఈ నెలలో అదే ఘటన, అదే మాదిరి సంభాషణతో మహమ్మదాబాద్ మండల కేంద్రంలో మరో వ్యక్తి రూ.10వేలు పోగొట్టుకున్న ఘటన వెలుగు చూసింది. ఈ ఘటనపై సదరు బాధితుడు సామాజిక మాధ్యమాల్లో విషయాన్ని వైరల్ చేయడంతో స్థానికంగానే మరికొంత మంది తమకు కూడా ఇలాంటి మోసం జరిగిందంటూ బయటికి వచ్చారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital