స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో భారత్ మార్కెట్లోకి మరో కొత్త మోడల్ని ప్రవేశపెట్టేందుకు రెడీ అవుతోంది. వివో టీ2 ప్రో 5జీ ఫోన్ ని వచ్చే వారం ఆవిష్కరించనున్నది. గత ఏప్రిల్‌లో వివో టీ2 5జీ, వివో టీ2ఎక్స్ 5జీ ఫోన్లు ఈ కంపెనీ తీసుకొచ్చింది. ఇక.. కొత్తగా రాబోయే ఈ ఫోన్ కర్వ్‌డ్ డిస్ ప్లే విత్ గోల్డెన్ షేడ్.. సెంట్రల్లీ అలైన్డ్ హోల్ పంచ్ కటౌట్‌తో రానున్నట్టు తెలుస్తోంది. ఇక.. ఈ ఫోన్‌ని ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా మాత్రమే సేల్స్ కి తీసుకురబోతున్నట్టు టెక్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.
ఈ నెల 22వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు వివో టీ2 ప్రో 5జీ ఫోన్ ఆవిష్కరిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఇందుకోసం ఫ్లిప్ కార్ట్ ప్రత్యేకంగా వెబ్ పేజ్ క్రియేట్ చేసింది. ఈ ఫోన్ డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ విత్ సపోర్ట్ ఫర్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్)తో వస్తున్నది. రింగ్-షేప్డ్ ఎల్ఈడీ ఫ్లాష్‌తోపాటు సర్కిళ్లలో సెన్సర్లు ఉంటాయి. ఐక్యూ జడ్7 ప్రో5జీ ఫోన్ డిజైన్‌ను పోలి వివో టీ2 ప్రో 5జీ ఫోన్ ఉంటుంది.
వివో టీ2 ప్రో 5జీ ఫోన్ ధర ఎంత అన్నది అధికారికంగా వెల్లడించలేదు. కానీ, ఐక్యూ జడ్7 ప్రో 5జీ ఫోన్ తరహాలోనే రూ.23,999 ఉండొచ్చునని అంచనా. గత నెలలో 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.21,999, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.22,999లకు ఐక్యూ జడ్7 ప్రో 5జీ ఫోన్ మార్కెట్లోక ఆవిష్కరించిన సంగతి తెలిసిందే.
వివో టీ2 ప్రో 5జీ ఫోన్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ విత్ 1200 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ తో కూడిన డిస్ ప్లే ఉండొచ్చునని భావిస్తున్నారు. మీడియా టెక్ డైమెన్సిటీ 7200 ఎస్వోసీ చిప్ సెట్, 8జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్, 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్లలో లభిస్తుందని భావిస్తున్నారు.