Friday, November 22, 2024

కొవిడ్ ను అరిక‌ట్టేందుకు మోల్నుపిర‌విర్.. మార్కెట్ లోకి కొత్త మెడిసిన్..

కోవిడ్‌-19 నిరోధక ఔషధమైన మోల్నుపిరవిర్‌ను మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు ఆప్టిమస్‌ ఫార్మా ప్రకటించింది. ఈ ఔషధం అత్యవసర వినియోగానికి ఇప్పటికే డీసీజీఐ నుంచి అనుమతి లభించిందని ఆప్టిమస్‌ ఫార్మా సీఎం డీ.డీ. శ్రీనివాసరెడ్డి తెలిపారు. దేశంలోని 29 ప్రదేశాల్లో 128 వలంటీర్లపై ఈ ఔషధం క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించామన్నారు. మోల్నుపిరవిర్‌ ఏపీఐ (యాక్టివ్‌ ఫార్మా ఇన్‌గ్రేడియం ట్‌)ను తాము సొంతంగా అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు.

కొవిడ్‌ వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌ను తగ్గించి, రోగి ఆరోగ్యంలో గణనీయమైన మెరుగుదలను మోల్నుపిరవిర్‌ తీసుకొస్తుందని చెప్పారు. ఈ ఔషధం వాడిన వారిలో ఐదు నుంచి పది రోజుల్లో నెగిటివ్ ఫలితం వస్తోందన్నారు. క్లినికల్‌ ట్రయల్స్‌లో ఈ ఔషధం ద్వారా ఎలాంటి సమస్యలు గుర్తించలేదని, మరణాలు సంభవించలేదన్నారు. దేశానికి అత్యవసరమైన వైద్యావసరాలను తీర్చడానికి ఆప్టిమస్‌ ఫార్మా సిద్ధంగా ఉంటుందన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement