Tuesday, November 26, 2024

జేఎన్టీయూలో కొత్త మాస్టర్స్‌ కోర్సు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీ (జేఎన్‌ఏఎఫ్‌ఏయు)లో కొత్త మాస్టర్స్‌ కోర్సును అందుబాటులోకి తీసుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రంలోనే తొలిసారిగా ఈ యూనివర్సిటీలో ఈ కోర్సును ప్రవెశ పెడుతున్నారు. ఎనర్జీ అండ్‌ సస్టైనబుల్‌ బిల్ట్‌ ఎన్విరాన్‌మెంట్‌లో కొత్త మాస్టర్స్‌ కోర్సును ప్రవేశపెడుతున్నట్లు యూనివర్సిటీ అధికారులు శనివారం నాడు ప్రకటించారు.

తెలంగాణ రాష్ట్రంలోనే ఈ కోర్సును ప్రవేశపెట్టిన తొలి విద్యాసంస్థ ఇదేనని వర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఎన్‌.కవితా దర్యాణిరావు తెలిపారు. ఈ కోర్సును ప్రవేశపెట్టడం చాలా అవసరమన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌లో ఈ కోర్సు ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. పరిశ్రమ, సబ్జెక్ట్‌ నిపుణుల సహకారంతో ఈ కోర్సును రూపొందించబడిందని, కోర్సులో 20 మందికి ప్రవేశాలను కల్పించనున్నట్లు తెలిపారు.

- Advertisement -

గ్రీన్‌ బిల్డింగ్‌ అనలిస్ట్‌, రెన్యూవబుల్‌ ఎనర్జీ స్పెషలిస్ట్‌, ఎన్విరాన్‌మెంటల్‌ పాలసీ అడ్వైజర్‌, ఎనర్జీ ఎఫిషియెంట్‌ మేనేజర్‌, బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్‌, స్టసనబుల్‌ మెటీరియల్స్‌ రీసెర్చర్‌, కార్బన్‌ ఫుట్‌ప్రింట్‌ అనలిస్ట్‌, క్లైమేట్‌ రెసిలెన్స్‌ ప్లానర్‌, స్టసనబిలిటీ స్పెషలిస్ట్‌, స్టసనబిలిటీ, రీజనరేషన్‌ మేనేజర్‌, నెట్‌ జీరో ఎనర్జీ కన్సల్టెంట్‌ మరియు ఎనర్జీ పాలసీ అనలిస్ట్‌ వంటి అంశాలను విద్యార్థులు నేర్చుకోవచ్చని పేర్కొన్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ఇటువంటి కోర్సు అవసరమని, అడ్మిషన్లను తీసుకుంటున్నట్లు ఆమె తెలిపారు. అడ్మిషన్లు పొందాలనే అభ్యర్థులకు బీ.టెక్‌ లేదా బి.డిజైన్‌ లేదా బి.ఆర్క్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ అర్హత ఉండి, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ అర్హత కలిగి ఉండాలని ఆమె తెలిపారు. మరిన్ని వివరాల కోసం యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement