Monday, December 2, 2024

New Lok Sabha – 24 నుంచి పార్ల‌మెంట్ స‌మావేశాలు…

కేంద్రంలో వరుసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. కేబినెట్‌ కూర్పు కూడా పూర్తైంది. మొత్తం 71 మంది ఎంపీల‌కు మంత్రులుగా అవ‌కాశం దక్కింది. వీరందరికీ శాఖలు కూడా కేటాయించడంతో ఇవాళ బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో కేంద్రం పార్లమెంట్‌ సమావేశాలకు పిలుపునిచ్చింది. ఈ సమావేశాల్లో లోక్‌సభ స్పీకర్‌ ఎన్నిక, కొత్త ఎంపీల ప్రమాణ స్వీకారం ) ఉంటుందని ప్రభుత్వ వర్గాలు మంగళవారం తెలిపాయి.

ఈ నెల 24 నుంచి జులై 3 వరకూ ఈ సమావేశాలు కొనసాగనున్నట్లు వెల్లడించాయి. నిమిది రోజులపాటు ఈ పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇందులో భాగంగా జూన్‌ 26న లోక్‌సభ స్పీకర్‌ ఎన్నిక జరిగే అవకాశం ఉంది. జూన్‌ 24, 25 తేదీల్లో కొత్త పార్లమెంట్‌ సభ్యులు ప్రమాణం స్వీకారం చేస్తారని సదరు వర్గాలు తెలిపాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement