Tuesday, November 26, 2024

కెసిఆర్ తోనే ఆర్టీసీ కార్మికుల‌లో కొత్త వెలుగులు – బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్

నిజామాబాద్ – ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన సందర్భంగా ఆర్టీసీ కార్మికులు ఉద్యోగులు రెట్టింపు ఉత్సాహంతో పని చేయాలని తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ రూరల్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పిలుపునిచ్చారు. మంగళవారం నిజాంబాద్ నగరంలోని రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లా డుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమాని కోసమే కేసిఆ ర్ నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థలో కార్మికులు, ఉద్యోగులు ఎంతో కష్టపడి రూ2వేల కోట్లల్లో ఉన్న నష్టాన్ని రూ600 కోట్లకు తీసుకువచ్చారని పేర్కొన్నారు. 43 వేల మంది కుటుంబాల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వెలుగులు నింపారని అన్నారు.

ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగుల జీవితాల్లో మర్చిపోలేని కానుకను సీఎం కేసీఆర్ ఇచ్చారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంత చేస్తుంటే ప్రతిపక్షాలు సిగ్గు లేకుండా ఆస్తులు అమ్మడానికే ప్రభుత్వంలో విలీనం చేశారని అనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఎవరైనా మాట్లాడితే ప్రజలే గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ ఆసుపత్రిని కూడా కార్పొరే ఆసుపత్రికి ధీటుగా తీర్చిదిద్దిం దని అన్నారు. ప్రభుత్వంలో విలీనమైనందున ఎన్నికలు ఉద్యోగులు బాధ్యతారా హితంగా వ్యవహరించకుండా క్రమశిక్షణతో పని చేయాలని దిశా నిర్దేశం చేశారు

Advertisement

తాజా వార్తలు

Advertisement