అమరావతి, ఆంధ్రప్రభ: తిరుపతిలో కొత్త పరిశ్రమలకు ఈనెల 23న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భూమిపూజ నిర్వహించనున్నట్లు రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ఆదివారం మంత్రి తిరుపతిలో పర్యటించారు. శీకాళహస్తి సమీపంలోని ఐనగలూరులో రూ.700 కోట్ల పెట్టు-బడులతో పదివేల మందికి ఉపాధి కల్పించే విధంగా అపాచీ మరో యూనిట్ భూమి పూజ చేయనున్నట్లు వెల్లడించారు. తిరుపతిలో ఐఐటీ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలకు శంకుస్థాపన చేస్తారన్నారు. అనంతరం తిరుపతి ఈఎంసీలోని టీ-సీఎల్ పరిశ్రమను అమర్ నాథ్ పరిశీలించారు.
రాష్ట్రాన్న్రి ఐటీ రంగంలో దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. ఎలక్ట్రాన్రిక్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో అగ్రగామిగా నిలవనున్న ఆంధ్రప్రదేశ్ త్వరలోనే విశాఖలో ఇన్ఫోసిస్ పరిశ్రమ ఏర్పాటు కానున్నట్లు పేర్కొన్నారు. విశాఖ, విజయవాడ, తిరుపతి కేంద్రాలుగా ఐటీ పరిశ్రమలను అభివృద్ధి చేయాలన్నది సీఎం లక్ష్యమని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తిరుపతి ఎంపీ గురుమూర్తి, శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఏపీఐఐసీ వీసీ అండ్ ఎండీ ఎండీ సుబ్రహ్మణ్యం జవ్వాది, అపాచీ, టీ-సీఎల్ పరిశ్రమ ప్రతినిధులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.