దేశంలోని పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. బీహార్, ఒడిశా, మిజోరం, కేరళ, మణిపూర్ రాష్ట్రాల గవర్నర్లు మారారు.
- ఒడిశా గవర్నర్ రఘుబర్ దాస్ రాజీనామాను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు.
- ప్రస్తుత మిజోరం గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు ఒడిశా గవర్నర్‌గా నియమితులయ్యారు.
- మిజోరాం గవర్నర్‌గా జనరల్ వీకే సింగ్ నియమితులయ్యారు.
- కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ బీహార్ గవర్నర్‌గా నియమితులయ్యారు.
- మణిపూర్ గవర్నర్‌గా అజయ్ కుమార్ భల్లా నియమితులయ్యారు.
- బీహార్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కేరళకు బదిలీ అయ్యారు.
ఈ గవర్నర్ల నియామకాలు వారు సంబంధిత కార్యాలయాలకు బాధ్యతలు స్వీకరించిన తేదీల నుండి అమలులోకి వస్తాయని రాష్ట్రపతి కార్యాలయం పేర్కొంది.