హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని మరో ఐదు వ్యవసాయ మార్కెట్లకు నూతన పాలకవర్గాలను నియమించినట్లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఆదిలాబాద్ జిల్లా ఇందర్‌వల్లి, మంచిర్యాల జిల్లా – జన్నారం, సూర్యాపేట జిల్లా – కోదాడ, పెద్దపల్లి జిల్లా – రామగుండం, కామారెడ్డి జిల్లా – కామారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీలకు నూతన పాలక వర్గాలు ఏర్పాటు అయ్యాయి.
ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 145 వ్యవసాయ మార్కెట్ కమిటీ-లకు నూతన పాలకవర్గాన్ని నియమించడం జరిగింది. నూతనంగా ఎన్నికైన పాలకవర్గ సభ్యులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభినందనలు తెలిపారు.