Sunday, September 8, 2024

Google Maps | గూగుల్ మ్యాప్స్ లో సరికొత్త ఫీచర్లు..

గూగుల్ మ్యాప్స్ లో వినియోగదారులకు సరికొత్త ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా గూగుల్ మ్యాప్స్ లో మార్పులు చేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ మార్పుల్లో భాగంగానే ఆరు కొత్త ఫీచర్లను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించింది. ఆయా ఫీచర్లను గూగుల్ గురువారం ప్రకటించింది.

ఫ్లై ఓవర్ అలర్ట్..

ఫ్లై ఓవర్ కాల్ అవుట్ పేరిట కొత్త సదుపాయాన్ని తెచ్చింది. ఆండ్రాయిడ్ యూజర్లు ఎప్పటి నుంచో కోరుతున్న ఈ ఫీచర్ వారంలో అందుబాటులోకి రానుంది. ఐఓఎస్ యూజర్లకు కాస్త ఆలస్యంగా ఈ ఫీచర్ లభించనుంది. దీంతోపాటు ఇరుకు రోడ్లకు సంబంధించిన మరో ఫీచర్ ను కూడా గూగుల్ తీసుకువచ్చింది.

ఫోర్ వీలర్ లో వెళ్లేటప్పుడు రోడ్లు ఇరుకుగా ఉంటే అటు వైపు ప్రయాణం వద్దు అని గూగుల్ మ్యాప్స్ లోని కొత్త ఫీచర్ చూపించనుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఇండోర్, బోపాల్, భువనేశ్వర్ వంటి ఎనిమిది నగరాల్లో విడుదల చేసింది.

మెట్రో టికెట్లు కొనుగోలు..

గూగుల్ ఓఎన్డిసి, నమ్మ యాత్రితో భాగస్వామ్యం కలిగి ఉంది. దీంతో భారతీయ వినియోగదారులు మెట్రో టికెట్లను కొనుగోలు చేయవచ్చు. ఇది కొచ్చి చెన్నై నుంచి ప్రారంభం కానుంది. ఈ ఫీచర్ సహాయంతో వినియోగదారులు టికెట్లు కొనుగోలు చేయగలరు. గూగుల్ మ్యాప్స్ నుంచి వాటికి నగదు చెల్లించవచ్చు. అందుకు అనుగుణంగా ఈ ఫీచర్ రూపొందించారు.

ఈవీ చార్జింగ్ స్టేషన్ల సమాచారం..

గూగుల్ మ్యాప్స్ ఫీచర్లలో ఈవి చార్జింగ్ స్టేషన్ సమాచారాన్ని కూడా పొందుపరిచింది. గూగుల్ మ్యాప్స్ లోనే ఈవి చార్జింగ్ స్టేషన్ ఫీచర్ వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉండనుంది. ఈ ఫీచర్ ను ప్రవేశపెట్టిన తర్వాత ఈవీ వినియోగదారులు తమ రూట్లో వచ్చే ఈ చార్జింగ్ స్టేషన్ గురించి సులభంగా సమాచారాన్ని పొందేందుకు వీలుంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement