విమాన టికెట్లను డిస్కౌంట్ ధరలకు అందించేందుకు గూగుల్ కొత్త ఫీచర్‌ను తీసుకు వచ్చింది. సాధారణంగా విమాన టికెట్ల ధరలు తరచుగా మారుతుంటాయి. డిమాండ్‌ను బట్టి వీటి రేట్లలో చాలా వ్యత్యాసం వస్తోంది. టికెట్లు బుక్ చేసుకున్న తరువాత కూడా వీటి ధరలు తగ్గిన సందర్భాలు ఉంటాయి. ఇలాంటి సమస్యలను అధిగమించేందుకు గూగుల్ ఫ్లైట్స్ పేరుతో కొత్త ఫీచర్లను తీసుకు వచ్చింది.
బుక్ చేసుకోవడం..
ప్రయాణికులు వెళ్లాల్సిన ప్రాంతానికి ప్రస్తుతం ఉన్న టికెట్ ధర గతంలో పోలిస్తే తక్కువ ఉందా, లేదా అని పోల్చుకునే ఆప్షన్‌ను గూగుల్ ప్లైట్స్‌లో ప్రస్తుతం ఉంది. అయితే ప్రస్తుతం బుక్ చేసుకోవాలా, ఇంకా టికెట్ ధర తగ్గే అవకాశం ఉందా అన్న సందేహం ప్రస్తుతం అలాగే ఉటుంది. తాజాగా గూగుల్ తీసుకు వస్తున్న ఫీచర్ గత చరిత్రను బట్టి ధర తగ్గే అవకాశం ఉందో లేదో చెప్పనుంది. ఈ సమాచారంతో ప్రయాణికులు టికెట్లను ఎప్పుడు బుక్ చేసుకోవాలో నిర్ణయంచుకోవచ్చని గూగుల్ తెలిపింది.
తక్కువ ధరలు…
టికెట్లను తక్కువ రేట్లలో బుక్ చేసుకునేందుకు ప్రైస్ ట్రాకింగ్ అనే కొత్త ఫీచర్‌ను తీసుకు వస్తోంది. ఈ ఆప్షన్‌ను ఎనేబుల్ చేసుకుంటే ఎప్పుడు టికెట్ రేట్లు తగ్గినా వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. కావాలంటే ప్రయాణానికి అనుగుణంగా కొన్ని నెలల ముందు ఎప్పుడు రేట్లు తక్కువగా ఉంటే అప్పుడు నోటిఫికేషన్ వచ్చేలా ప్రత్యేకంగా తేదీలను కూడా సెట్ చేసుకోవచ్చు. ఇందుకోసం గూగుల్ అకౌంట్లోకి లాగిన్ అయి ఉండాలి.
కొన్ని విమానాల ప్రయాణాలపై గూగుల్ ఓ రంగుతో ఉన్న బ్యాడ్జ్‌ను ఉంచుతుంది. ట్రెండ్‌ను బట్టి టికెట్ ధర ఇంతకంటే తగ్గే అవకాశం లేదని దీని అర్ధం. ఒక వేళ మీరు కొన్న దానికంటే తగ్గితే ఎక్కువ చెల్లించిన మొత్తాన్ని గూగుల్ పే ద్వారా బుక్ చేసుకున్న వారి అకౌంట్లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తుంది.
వీటితో పాటు గూగుల్ 2023 ప్రయాణాలకు సంబంధించిన ట్రెండ్స్‌ను తన బ్లాక్‌లో పుంచుకుంది. సాధారణంగా డిసెంబర్ మధ్యలో ప్రారంభమయ్యే క్రిస్మస్ సెలవుల కోసం అక్టోబర్ నుంచే టికెట్ల బుకింగ్ ప్రారంభమవుతుంది. గత ట్రెండ్స్ ప్రకారం విమానం బయలుదేరే తేదీకి 22 రోజుల ముందు టికెట్ల ధరలు తక్కువగా ఉంటున్నాయని గూగుల్ తెలిపింది.