జీమెయిల్ యాప్ ద్వారా వినియోగదారులు ఇకనుంచి వీడియో, అడియో కాల్స్ చేసుకునే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్‌ను గూగుల్ తొలుత సెప్టెంబర్‌లోనే ప్రకటించినా డిసెంబర్ 6 నుంచి అమలులోకి వచ్చింది. ఆండ్రాయిడ్ సెల్ ఉన్నవారు జీమెయిల్ యాప్ ద్వారా ఒకరికి ఒకరు వాయిస్, వీడియోకాల్స్‌ను వినియోగించుకోవచ్చని గూగుల్ ప్రకటించింది.
జీ స్యూట్ లేదా వ్యక్తిగత గుగుల్ ఖాతాలు ఉన్న ఎవరైనా ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు. సాధారణ చాట్‌కు ఎగువ కుడివైపున ఫోన్, వీడియో చిహ్నాలు ఉంటాయి. జీమెయిల్‌ను కమ్యూనికేషన్ సేవలకు కేంద్రంగా చేయాలనే లక్ష్యంతో గూగుల్ ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది.