Friday, November 22, 2024

వాట్సాప్‌లో కొత్త ఫీచర్‌.. ఒకే ఫోన్‌లో రెండు అకౌంట్లు

మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్‌ను తీసుకు వచ్చింది. ఒకే వాట్సాప్‌లో వేర్వేరు అకౌంట్లను ఉపయోగించుకునే వెసులుబాటు కల్పించింది. వాట్సాప్‌ ఇప్పటికే లాక్‌చాట్‌, స్క్రీన్‌ షేరింగ్‌, మల్టి డివైజ్‌ ఫీచర్లను అందుబాటులోకి తీసుకు వచ్చింది.
ప్రస్తుతం ఒక ఫోన్‌లో ఒకే వాట్సాప్‌ ఖాతాను వినియోగించుకునే సదుపాయం మాత్రమే ఉంది.

ఒకే ఫోన్‌లో జనరల్‌ వాట్సాప్‌తో పాటు బిజినెస్‌ వాట్సాప్‌ను ఇప్పటికే వినియోగించుకునేందుకు అవకాశం ఉంది. తాజాగా రెండు వాట్సాప్‌ల కోసం రెండు ఫోన్లు వినియోగించే ఇబ్బంది లేకుండా ఒకే ఫోన్‌లో రెండు ఖాతాలను వినియోగించుకునే వెసులుబాటు కల్పిస్తోంది. ఈ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చిన తరువాత యూజర్లు తమ వాట్సాప్‌ అకౌంట్‌లో క్యూఆర్‌ కోడ్‌ ఆప్షన్‌ వద్ద ఉన్న యారో ఐకాన్‌ సాయంతో మరో అకౌంట్‌ను యాడ్‌ చేసుకోవచ్చు.

- Advertisement -

దీనితోనే వేరే ఖాతాకు మారవచ్చు. దీంతో ఒకే ఫోన్‌లో రెండు వేరు వేరు నంబర్లతో వాట్సాప్‌ ఖాతాలను నిర్వహించుకునే వీలు కలుగుతుంది. ప్రస్తుతం వాట్సాప్‌ బీటా యూజర్లకు మాత్రమే ఇది అందుబాటులో ఉంది. త్వరలోనే యూజర్లు అందరూ వినియోగించుకునేందుకు అవకాశం కల్పించనున్నట్లు తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement