Saturday, November 23, 2024

Tech update | వాట్సాప్ లో అధిరిపోయే కొత్త ఫీచ‌ర్.. ఇకపై ఫోన్ నంబర్‌ షేర్ చేయాల్సిన అవసరం లేదు

వాట్సాప్ లో అదిరిపోయే ఫీచర్ అందుబాటులోకి రానుంది. యూజ‌ర్ల‌కు సరికొత్త అనుభూతిని అందించేందుకు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు తీసుకొస్తుంది వాట్సాప్. మెటా మాతృసంస్థగా ఉన్న ఈ పాపులర్ మెసేజింగ్ యాప్ త్వరలో మరో అద్బుత ఫీచర్ ను యూజర్లకు అందించేందుకు సిద్ధమైంది. ఇకపై వాట్సాప్ లో యూజర్ నేమ్ లు క్రియేట్ చేసుకునే ఫీచర్ అందించనుంది. అంటే ఇన్ స్టా, ఫేస్ బుక్ లాగా అందరూ ఇకపై ఫోన్ నంబర్ లేకుండానే ఎవరితోనైనా చాట్ చేయవచ్చు. వాళ్ల యూజర్ నేమ్ తెలిస్తే సరిపోతుంది. ఈ కొత్త ఫీచర్ తో యూజర్ల ప్రైవసీ మరింత పెరగనుంది. ఫోన్ నంబర్ షేర్ చేయాల్సిన అవసరమే ఉండదు.

ప్రస్తుతం ప్రయోగాత్మక దశలో ఉన్న ఈ ఫీచర్ ను త్వరలోనే యూజర్లకు అందించాలని వాట్సాప్ భావిస్తోంది. వచ్చే అప్డేట్ లో ఇది అందుబాటులోకి వచ్చే సూచనలు కన్పిస్తున్నాయి. అయితే యూజర్ నేమ్ తో చాట్ చేసినా కూడా ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్షన్ భద్రత ఉంటుంది. ఈ ఫీచర్ వాట్సాప్ సెట్టింగ్స్ మెనూలో ప్రొఫైల్ సెక్షన్ లో కన్పించే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement