అమరావతి, ఆంధ్రప్రభ: హుబ్లి – విజయవాడ మధ్య ప్రతి రోజూ నడిచేలా కొత్త ఎక్స్‌ప్రెస్ రైలును దక్షిణ మధ్య రైల్వే ఈ నెల 20 నుంచి నడపనుంది. ఈ రూట్లో రద్దీ ఉండటంతో కొత్త రైలును నడపాలని ప్రయాణికులు, ప్రజాప్ర తినిధులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రైన్ నెం.. 17329 హుబ్లి – విజయవాడ ఎక్స్‌ప్రెస్‌ను ఈ నెల 20 నుంచి నడపనున్నారు. ఈ రైలు ఈ నెల 20 నుంచి రాత్రి 9.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12.20 గంటలకు చేరుకోనుంది. అలాగే 17330 విజయవాడ – హుబ్లి 21 నుంచి మధ్యాహ్నం 1.50 గంటలకు బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 5.30 గంటలకు చేరుకుంటుంది. మార్గమధ్యంలో గడగ్ జంక్షన్, కొప్పల్, మునిరాబాద్, హాస్పెడ్ జంక్షన్, తోరంగల్లు, బంతనహాల్, మద్దికెర, పుండేకల్లు, డోన్, రంగాపురం, బేతంచర్ల, పాణ్యం, నంద్యాల, గాజులపల్లి, దిగువమెట్ట, గిద్దలూరు, సోమిదేవిపల్లి, కంభం, తర్లుపాడు, మార్కాపూర్ రోడ్, దొనకొండ, కురిచేడు, వినుకొండ, శావల్యాపురం, సంతమంగలూరు, నరసారావుపేట, పేరేచర్ల, నల్లపాడు జంక్షన్, గుంటూరు జంక్షన్, నంబూరు, మంగళగిరి స్టేషన్ల మధ్య ఆగుతుంది. .
అలాగే రద్దీని నివారించేందుకు ట్రైన్ నెం.. 02763 తిరుపతి – సికింద్రాబాద్ ప్రత్యేక రైలును ఈ నెల 17న దక్షిణ మధ్య రైల్వే నడుపుతోంది. ఈ రైలు 17న సాయంత్రం 5 గంటలకు తిరుపతిలో బయలుదేరి తరువాతి రోజు ఉదయం 5.42 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. మార్గంలో రేణిగుంట, శ్రీ కాళహస్తీ, వెంకటగిరి, గూడూరు జంక్షన్, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, ఖమ్మం, డోర్నకల్, మహబూబాబాద్, వరంగల్, కాజిపేట జంక్షన్, జనగామ్ స్టేషన్లలో ఆగుతుంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..