- మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చేందుకు ప్రణాళికలు
- జెన్ కో లో వివిధ పోస్టులకు ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేత
దేశవ్యాప్తంగా ఇంధన విధానంతో పాటు రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన ఉత్పత్తికి అవసరమైన అంశాలను అధ్యయనం చేసి కొత్త ఇంధన పాలసీని రూపొందించినట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. పెట్టుబడులు ఆకర్షించే విధంగా జనవరి 9న నూతన ఇంధన విధానాన్ని ప్రకటించనున్నట్లు వెల్లడించారు.
తెలంగాణ జెన్‌కోలో అసిస్టెంట్ ఇంజనీర్, ఇతర పోస్టులకు ఎంపికైన 315 మంది అభ్యర్థులకు భట్టి నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. “రాష్ట్ర జీఎస్‌డీపీ వృద్ధిలో ఇంధన శాఖ ప్రధాన పాత్ర పోషిస్తోంది. తెలంగాణని మిగులు విద్యుత్‌గా రాష్ట్రంగా మార్చేందుకు 20 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి ప్రణాళిక రూపొందించాం. జెన్ కో-సింగరేణి సంయుక్తంగా రామగుండంలో థర్మల్ పవర్ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్నాయని” డిప్యూటీ సీఎం భట్టి అన్నారు.
- Advertisement -