హైదరాబాద్‌కు డబుల్ డెక్కర్ బస్సులు రానున్నా యి. ఇందుకు సంబంధించి సీఈఎస్‌ఎల్ ప్రకటన చేసింది. డీజిల్ ధర పెరుగుదల, కాలుష్యం కారణంగా ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయాలని ప్రభుత్వం సూచి స్తోంది. ఆ దిశగా ప్రభుత్వరంగ కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్(సీఈ ఎస్‌ఎల్) 5,580 ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుకు సంబంధించి రూ.5,500 కోట్ల విలువైన భారీ టెండర్‌ను ప్రకటించింది. ఇందులో 130 డబుల్ డెక్కర్ బస్సులున్నాయి. తొలి దశ లో హైదరాబాద్, బెంగళూరు, సూరత్, కోల్‌కతా పట్టణాలకు ఈ ఏడాది జులై నాటి కే ఈ-బస్సులు అందుబాటులోకి వస్తాయని సీఈఎస్‌ఎల్ పేర్కొంది. ప్రపంచంలో ఇదే అతి పెద్ద పథకమని సీఈఎస్‌ఎల్ ఎండీ, సీఈవో మహువా ఆచార్య చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాల ఈ-బస్సుల లక్ష్యాల సాధనకు తమవంతు సహకారం అందిం చాలన్నారు.
కర్బన ఉదర్గారాల్లో భారత్ ను తటస్తంగా సున్నా స్థాయికి చేర్చే లక్ష్యానికి ఇది తోడ్పడుతుందని సీఈఎస్‌ఎల్ తెలిపింది. హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్ బస్సులు నడిపించాలంటూ పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ను ఓ నెటిజన్ ట్విట్టర్‌లో కోరగా.. వెంటనే ఆ విషయాన్ని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ దృష్టికి కేటీఆర్ తీసుకువెళ్లారు. ఈ మేరకు డబుల్ డెక్కర్ బస్సులు కొనేందుకు ఆర్టీసీ టెండర్లను ఆహ్వానించింది. ఆ తర్వాత పలు కారణాలవల్ల ఇది సాధ్యం కాలేదు. సీఈఎస్‌ఎల్ సంస్థ దాదాపు 130 డబుల్ డెక్కర్ బస్సులు కొనుగోలు చేయడంతో హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్ బస్సులు త్వరలో తిరగనున్నాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..