Friday, November 22, 2024

New Delhi – త‌క్ష‌ణం విధుల్లో చేరండి…వైద్యుల‌కు సుప్రీం కోర్టు ఆదేశం


వైద్యులు పని చేయకపోతే ప్రజా ఆరోగ్యకేనికే న‌ష్టం
చికిత్స అంద‌క పేద‌లు పాడుతున్న పాట్లు చూడండి
స‌మ‌స్య‌ల‌ను శాంతియుతం ప‌రిష్కిస్తాం
అంద‌రికి న్యాయం చేస్తాం

న్యూ ఢిల్లీ – కోల్ కోత వైద్యురాలు హ‌త్యాచారం కేసులో న్యాయం చేయాల‌ని కోరుతూ ఆందోళన చేస్తున్న వైద్యులు విధులకు హాజరుకావాలని సూచన చేసింది సుప్రీంకోర్టు. మీ ఆందోళన కారణంగా పేదలు నష్టపోకూడదని, వెంటనే విదుల్లోకి రావాలని ఆదేశించింది. మీపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా చూస్తామని సీజేఐ ధర్మాసనం నేడు స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కోల్‌కతా డాక్టర్ హత్యాచార ఘటనపై సుప్రీంకోర్టు గురువారం విచారణ చేపట్టింది. విచారణ జరువుతున్న సుప్రీంకోర్టు ధర్మాసనానికి స్టేటస్ రిపోర్ట్ దాఖలు చేసింది సీబీఐ. సీల్ కవర్‌లో రిపోర్ట్‌ను అందజేసింది. కేసు దర్యాప్తు పురోగతిని నివేదికలో ప్రస్తావించింది.


ఇదిలావుండగా ఆందోళన చేస్తున్న డాక్టర్లు విధులకు హాజరుకావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. డ్యూటీ చేస్తూనే ఆందోళన చేస్తున్నామని వైద్య సంఘాలు తెలిపాయి. విధులకు హాజరైనప్పటికీ క్యాజువల్ లీవ్ కట్ చేసి వేధిస్తున్నారని వెల్లడించాయి. దీనిపై స్పందించిన ధ‌ర్మాస‌నం తొలుత విధులకు హాజరుకావాలని సూచించింది. వైద్యులు పని చేయకపోతే ప్రజా ఆరోగ్య వ్యవస్థ ఎలా నడుస్తుందని సూటిగా ప్రశ్నించింది.

- Advertisement -


ఆసుపత్రుల్లో వసతులు ఏ విధంగా ఉంటాయో తాము అర్థం చేసుకోగలమన్నారు సీజేఐ. గతంలో ఓసారి మిత్రుడ్ని చూడ్డానికి వెళ్లి ఓ రాత్రి అక్కడే పడుకున్నానని, అక్కడి పరిస్థితులను కళ్లతో చూడాల్సి వచ్చిందన్నారు.


నేషనల్ టాస్క్‌ఫోర్స్‌లో రెసిడెంట్ డాక్టర్లను చేర్చాలని ఆయా సంఘాలు కోరాయ‌ని అంటూ రెసిడెంట్ డాక్టర్ల సమస్యలను నేషనల్ టాస్క్‌ఫోర్స్ వింటుందని సీజేఐ భరోసా ఇచ్చారు. కమిటీలో భాగస్వాములుగా ఉండడానికి, కమిటీ ఎదుట వాదన చెప్పడానికి తేడా ఉంటుందన్నది డాక్టర్ల తరపు న్యాయవాదుల వెల్లడించారు. ఒక్కోసారి వైద్యుల డ్యూటీ 48 గంటల పాటు ఉంటుందన్నారు.
ఈ స్థితిలో వైద్యుడి మానసిక, శారీరక స్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవాలన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనివేళలు, వర్కింగ్ కండిషన్‌పై ఎన్టీఎఫ్ దృష్టి సారిస్తుందన్నారు. ఎన్టీఎఫ్‌లో ఉన్న వైద్యులు ఈ స్థితిని దాటి వచ్చినవారేనని, వర్కింగ్ కండిషన్స్, ఇతర సమస్యల గురించి తెలుసన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement