న్యూ ఢిల్లీ – ‘వన్ నేషన్, వన్ ఎలక్షన్ బిల్లుపై ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ వచ్చే నెల 8న తొలిసారి సమావేశం కానుంది. ఆ రోజు ఉదయం 11 గంటలకు సమావేశం మొదలుకానుందని ఆ కమిటీ జాయింట్ సెక్రెటరీ గుండా శ్రీనివాసులు ఒక ప్రకటన ద్వారా మీడియాకు వెల్లడించారు. కమిటీ ఛైరపర్సన్‌తోపాటు సభ్యులు అంతా ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ఈ మేరకు సమాచారాన్ని సభ్యులకు పంపినట్లు ఆయన తెలిపారు.
అలాగే 129వ రాజ్యాంగ సవరణ బిల్లుపై, కేంద్రపాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లుపై ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ సమావేశం కూడా జనవరి 9న జరగనుంది.. ఈ సమాచారాన్నికూడా సభ్యులందరికీ తెలిపినట్లు ఆ కమిటీ కార్యదర్శి వెల్లడించారు.