Friday, October 18, 2024

TG | స్కిల్‌ యూనివర్సిటీలో అందుబాటులోకి కొత్త‌ కోర్సులు….

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్కిల్‌ యూనివర్సిటీ(వైఐఎస్‌యూ)లో నవంబరు నుండి కోర్సులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు స్కిల్‌ యూనివర్సిటీ శుక్రవారం ఒక ప్రకటన జారీ చేసింది. దసరా నాటికి కోర్సులు అందుబాటులోకి తీసుకురావాలన్న ఆలోచనతో ఆసక్తి ఉన్న విద్యార్థుల నుంచి పలు కోర్సుల్లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు వీసీ వీఎల్‌వీఎస్‌ఎస్‌ సుబ్బారావు తెలిపారు.

ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ నెల 29నాటికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతానికి గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్‌ స్టాఫ్‌ కాలేజీ ఆఫ్‌ ఇండియా క్యాంపస్‌లో క్లాసులు నిర్వహించనున్నట్లు నవంబరు 4 నుండి మొదలు కాబోతున్న కోర్సులు, లాజిస్టిక్‌, మెడికల్‌, హెల్త్‌, ఫార్మా రంగాల్లో తరగతులు ఉంటాయన్నారు. త్వరలోనే మరిన్ని కోర్సులు ప్రారంభిస్తామని చెప్పారు. ఈ కోర్సులకు సంబంధించిన ల్యాబ్స్‌ కోసం ప్రభుత్వం రూ.7కోట్లు ఇప్పటికే విడుదల చేసిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement