Friday, November 22, 2024

శునకాల ద్వారా మానవుల్లోకి కొత్త కరోనా!..మలేసియాలో వెలుగుచూసిన వైరస్

కరోనా వైరస్‌లో రోజుకో కొత్త వేరియంట్ వెలుగుచూస్తున్న వేళ తాజాగా మరో రకం కరోనా వైరస్‌ను శాస్త్రవేత్తలు గుర్తించారు. మలేసియాలో వెలుగుచూసిన ఈ వైరస్ శునకాల నుంచి మానవుల్లోకి చొరబడి ఉంటుందని అనుమానిస్తున్నారు. అయితే, దీనివల్ల మనుషులకు జరిగే హానికి సంబంధించి ఇంకా ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. శునకాల్లోని కరోనా వైరస్‌ను మనుషుల్లో గుర్తించడం ఇదే తొలిసారని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ వైరస్ మానవుల నుంచి మానవులకు సోకుతుందా? అన్నది తేలాల్సి ఉంది. ఇలాంటి వైరస్‌లు రాత్రికి రాత్రే మహమ్మారిగా మారబోవని స్పష్టం చేశారు. తొలుత మనుషుల శరీరంలోని రోగ నిరోధకశక్తికి అనుగుణంగా సర్దుబాటు చేసుకుంటాయని, ఈ క్రమంలో ఇన్ఫెక్షన్ కలిగించడానికి ఎన్నో ఏళ్లు పడుతుందని శాస్త్రవేత్తలు వివరించారు. ఈ కొత్త వైరస్‌కు ‘సీసీవోవీ-హెచ్‌యూపీఎన్-2018’ అని పేరుపెట్టారు. కరోనా కారక సార్స్‌కోవ్-2 తర్వాత మానవుల్లోకి వచ్చిన వైరస్ ఇదేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement