హైదరాబాద్, ఆంధ్రప్రభ: తెలంగాణలో కరోనా కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా 9 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. 12మంది కొవిడ్‌కు చికిత్స పొంది వివిధ ఆసుపత్రల నుంచి డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో కొవిడ్ సోకిన 66 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.
తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా 5439 కరోనా టెస్టులు చేయగా 9 కొత్త కేసులు వెలుగుచూశాయి. తాజాగా నమోదైన 9 కొత్త కేసుల్లో 8 కేసులు హైదరాబాద్‌లోనే వెలుగు చూడడం గమనార్హం. మరో కేసు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలో నమోదైంది.
- Advertisement -