Thursday, September 19, 2024

New Committee – ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎంపి చిన్ని

ఆంధ‌ప్ర‌భ స్మార్ట్ – అమరావతి : ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎంపీ కేశినేని చిన్ని ( శివనాథ్ ) తో పాటు మొత్తం కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సెప్టెంబర్‌ 8న ఏసీఏకు ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల చేయగా నిన్న శుక్రవారం ఎన్నికల నామినేషన్లకు చివరి తేదీగా నిర్ణయించారు. ఈ ఎన్నికల్లో ఏసీఏలోని అన్ని పదవులకు ఒక్కొక్కరే నామినేషన్‌లు దాఖలు చేయడంతో ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది.

అధ్యక్షుడిగా కేశినేని శివనాథ్ , ఉపాధ్యక్షుడిగా వెంకట ప్రశాంత్‌ , కార్యదర్శిగా సానా సతీష్‌, జాయింట్‌ సెక్రటరీగా విష్ణు కుమార్‌రాజు, కోశాధికారిగా శ్రీనివాస్‌. కౌన్సిలర్‌గా గౌరు విష్ణుతేజ్‌ ఎన్నికయ్యారు. అయితే తుది ఫలితాలను వచ్చే నెల 8న అధికారికంగా ప్రకటించనున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement